December 24, 2009

తెలంగాణా పులకేసికి మరో పూనకం


మాటలు మర్చేవారిని రాజకీయ నాయకులతో ఎందుకు పోలుస్తారో నాకిప్పుడు అర్ధమైంది. తెలంగాణాపై మొదటిసారి చిదంబరం ప్రకటన చేసినప్పుడు అధీష్టానం అదేశాలకు పార్టీలోని ఎమెల్యేలు ఎంపీలందరూ కట్టుబడిఉండాలని తెలంగాణా కాంగ్రెస్‌కు చెందిన నేతలందరూ సీమ ఆంధ్ర నాయకులకు విజ్గ్నప్తి చేసారు. కానీ రెండోసారి చిదంబరం ప్రకటన వెలువడినతరువాత అదే ఎమెల్యేలు, ఎంపీలు రాజినామలు సమర్పించి టీఆరెస్‌తొ చేతులు కలిపారు. మరి దీనినే "తనది కాకపొతే తాడిమట్టకు ఎదురు డేకమని" అనడం అన్నమాట.

ఇక ఆంధ్రాలో బంకర్లు నిర్మించవలసిన ఆవశ్యకత కనబడుతోంది. ఎందుకంటే పులకేసి అణువిస్పోటం జరుగుతుందని హెచ్చరించారు కదా అందుకు. చిదంబరం ప్రకటన చేసిన తరువాత పులకేసిని రెండోసారి ఉద్యమం మొదలుపెడుతూ ప్రజలకు కొన్ని సూచనలు చేసారు. ఉద్యమమకారులంతా శాంతియుతంగా ఉండాలని. వారిమాటలను ఉద్యమకారులు "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం" అని అరుచుకుంటూ నలభై బస్సులను నాశనం చేసి నాలుగు బస్సులు తగులబెట్టి ఆచరించి చూపారు. తెలంగాణాలోని నాయకులంతా రాజీనామాలు చెయ్యాలని పులకేసి వినమ్రంగా కోరారు. అందుకే రాజీనామా చేయని నాగం జనార్ధన రెడ్డిపైన మరికొందరిపైనా ఉద్యమకారులు పిడిగుద్దులు కురిపించారు. ఉద్యమం చేస్తున్నంతసేపూ వారెవరైనా విద్యార్ధులే. ఒకవేళ ఖర్మకాలి దొరికిపొతే వారు విద్యార్ధులుగానీ టీఆరెస్ కార్యకర్తలుగానీ కారు. అరాచక శక్తులు. ఇంకాచెప్పాలంటే ఆంధ్రోళ్ళు అయిఉండవచ్చు. కాబట్టి విద్యార్ధులకు ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

ఇక మీడియాకు మళ్ళీ పండగ వాతావరణం వచ్చింది. సీమ ఆంధ్రా ప్రాంతాలలోని ఉద్యమాలు ఇష్టం లేకున్నా చుపించవలసి వచ్చినందుకు చాలా బాధ పడ్డారు. మళ్ళీ తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నందుకు వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ ఒక్క బస్సు దహనంగానీ నాశనంగానీ వారి కనుసన్నలు దాటి పోకుండా వారు ప్రసారం చేయగలుగుతున్నారు. నాగం జనార్ధనరెడ్డిపై దాడిని మళ్ళి మళ్ళి చూపిస్తూ మిగిలినవారిని బెదరగొట్టడమే వారి ధ్యేయంగా కనబడుతోంది. ఓ.యూ.లో కవరేజి నిమిత్తం వెళ్ళిన విలేకరి ఆంధ్రా వాడనిచెప్పి అతనిపై దాడి చేసారు.


మరో పక్క ప్రజలు భీతావహులు కావడమే కాకుండా బందులవల్ల రాష్ట్రంలో మూతబడుతున్న ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు తేరుకోలేకుండా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు కొంత పర్వాలేదు. కానీ ప్రయివేటు సంస్థలు? సరియైన ఆర్డర్లు రాక, వచ్చిన ఆర్డర్లను చేయలేక సంస్థలు మూతబడే అవకాశం ఉంది. ఈ అరాచక పరిస్తితి రాష్ట్రానికి తలమానికంగా తయారైన సాఫ్ట్వేర్ సంస్థలను చుట్టుముడితే రాష్ట్రంలో దాదాపు మూడు లక్షలమంది ప్రత్యక్షంగానూ రెందు లక్షలమంది పరోక్షంగానూ నిరుద్యోగులయ్యే ప్రమాదముందని నిపుణులు చెపుతున్నారు. మరి ఈ విషయంపై పులకేసిని ప్రశ్నిస్తే వారు చార్మినార్ లేదా గోల్కొండల దగ్గిర దుప్పటి పరుచుకోమనిగానీ తెలంగాణా చరిత్ర చెప్పుకుంటూ గైడ్‌గ పనిచేసుకోమనిగానీ చెపుతారేమో?

ఏది ఏమైనా రాష్ట్రంలోని పరిస్తితులు రాష్ట్రపతి పాలనకు దారి తీస్తున్నాయని చెప్పకనే చెపుతున్నాయి.

17 comments:

Shashank said...

ఆ మాహానుభావుడు యే ముహూర్తానా "ఆమరణ నిరాహార దీక్ష" మొదలెట్టాడో కాని.. గత 30 రోజులుగా రాష్ట్రం లో జరుగుతున్న అలజడికి ఇప్పటికి మన రాష్ట్రానికి ప్రత్యక్షంగా 5000 కోట్ల నష్టం వాటిల్లింది. పరోక్షంగా ఇంకా తెలీదు. ఈ చెత్త పెంట రాజకీయాల వళ్ళ చాలా మంది ఇక్కడనుండి పలాయనం చిత్తగించవచ్చు పొరుగురాష్ట్రాలకి.. నష్టం మనకే. ఆ ముక్క తెలంగాణా దీనజనోద్ధారక సామ్రాట్ శ్రీ శ్రీ శ్రీ పులకేసి కి అర్థం అయితే బాగున్ను. మన రాష్ట్రం కనీసం ఓ 15 యేళ్ళు వెన్నక్కి వెల్లింది.

Unknown said...

vadeki ardham aithe vaddu pulakesi enduku avutahdu ? prez lo aithe best
ippudu

NAM blogsapien :) said...

yes ur right

సత్యాన్వేషి said...

1. రాజకీయ నాయకులు మాట మార్చ్డం తెలిసిందే కదా. చిదంబరం ప్రకటన ముందు రోజు వర్సకూ అన్ని పార్టీల నేతలు తెలంగానా పై తీర్మానం పెదితే సమ్ర్ధిస్తామన్నారు. ఆ తరువాత మాట మార్చి సమైక్యాంధ్ర నాటకం మొదలెట్టారు.

2. నాగం ముందే రాజీనామా ఇచ్చాడు. అతన్ని కొట్టింది ఆంధ్రా స్పాన్సర్ద్ గూండాలే. ఆంధ్రా నాయకులకు ఇల ఉద్యమాల్లో మధ్యలో గూండాలను పంపడం కొత్త కాదు కద? వివరాలు కావాలంటే నా బ్లగులో ఈ పోస్ట్ చూడండి.
హ్త్త్ప్://ఎదిసత్యం.బ్లొగ్స్పొత్.చొం/2009/12/బ్లొగ్-పొస్త్_24.హ్తంల్

3. ఆంధ్రా నాయకుల స్పాన్సర్ద్ ఉద్యమాలు ఇన్ని రోజులు చూపించారు కదా, ఇప్పుడు కొద్దిరోజులు తెలంగానా ప్రజలు సొంతంగా చేస్తున్న ఉద్యమాన్ని చూపిస్తే తప్పేంటి? నాకు మీ మీడియా పై కోపం ఏమిటో ఇంత వరకూ అధం కాలేదు. ఇదే విషయం పై నేను ఒక పోస్ట్ చేసాను, మీరు సమాధానం ఇవ్వలేదు.

బహుషా చిరంజీవి లాంటి సమైక్యాంధ్ర నాయకుల స్టేట్మెంటులు చూపిస్తే జనం ఉమ్మేస్తారని భయపడి మీడియా ఎక్కువగా చూపించలేదు.

4. చిదంబరం మొదటి ప్రకటనకి అంతా కట్టుబడి ఉంటే మరి ఈ గొడవలన్నీ ఉండేవి కాదు కదా.. మధ్యలో ఆంధ్రా నాయకుల డ్రామాల వల్లే కదా ఈ పరిస్తితి? కనీసం ఈ నేతలు వాల్ల పార్టీల మానిఫెస్టోలకి కట్టుబడి లేకపోతే ఏం చెయ్యాలి?

Anonymous said...

తమరిలాంటి బ్లాగర్సుక్కూడా పూనకం కావాలి కదా అందుకే...

"తనది కాకపొతే తాడిమట్టకు ఎదురు డేకమని" అంటే ఏంటో అర్థం నాకు సరిగ్గా తెలియదు. కాని ఖచ్చితంగా వ్యంగంతో నిండిన మీ కుళ్ళు బుద్దికి నిదర్శనం. అవును అధిష్టానికి కట్టుబడివుండే నియమాన్ని ముందుగా తెంచింది ఇతర ప్రాంతాల నాయకులే కాదా? మొత్తం తెలంగాణపై గాని మరియు మీరు ఇంతగా ప్రేమించే హైదరాబాద్ మీద పడిగాని దోచుకుతినే తెలంగాణేతర వలస నాయకులు చేస్తే ఈ వెటకారం గుర్తుకురాలేదా?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమైఖ్యాంధ్రతో పోల్చుకుని సంతృప్తిపడే మీలాంటివారికి హైదరాబాద్ మీద ఆశ తప్ప మరొకటి కాదని సుస్పష్టంగా అర్థమౌతుంది.


అవును ఖచ్చితంగా ఇతర ప్రాంతాలనుండి వచ్చిన కిరాయి గూండాలే విద్వంసం సృష్టించింది.

Sravya V said...

నేను ఇంతకూ ముందు టీవీ లో చూస్తుంటే ఆ దాడి చేసినతను శ్రీధర్ రాజు అని అతను ఇంతకు ముందు LB నగర్ లో కిరోసినే పోసుకొని చనిపోయిన శ్రీకాంత్ వాళ్ళ బందువు ని అతనిని నేనే చదివించాను అని చెబుతున్నాడు . అంటే శ్రీకాంత్ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పంపితేనే వచ్చాడా ?

Sravya V said...

నేను ఇంతకూ ముందు టీవీ లో చూస్తుంటే ఆ దాడి చేసినతను శ్రీధర్ రాజు అని అతను ఇంతకు ముందు LB నగర్ లో కిరోసినే పోసుకొని చనిపోయిన శ్రీకాంత్ వాళ్ళ బందువు ని అతనిని నేనే చదివించాను అని చెబుతున్నాడు . అంటే శ్రీకాంత్ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పంపితేనే వచ్చాడా ?

Sravya V said...
This comment has been removed by the author.
Sravya V said...
This comment has been removed by the author.
Unknown said...

అసలు పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలాలు ఎక్కడో మనందరికి తెలుసు..ప్రతి గ్రామానికి ఒక భుస్వామి(కులం పేరు నేను రాయతల్చుకోలెదు) వాడి ముందు ఊరివారందరూ చేతులు కట్టుకొని నుంచోవల్సిందే..ఈ వ్యవస్థని భరించలేక నక్సలిజం పుట్టిందని చరిత్ర చెప్తుంది....అది మన చరిత్ర..మన పులకేసి ఎప్పుడు అందుకే ఈ పెట్తుబడిదారులు ,వలసవాదులు అని అంటుంటాదు..ఆయన మూలాలు కుడా అవేకదా..

హైదరాబాద్ మనందరిది..దాని మీద నెగటివె రైట్స్ మాకే ఉన్నయి అంటే ఎవరూ ఒప్పుకోరు..మనందరికి తెలుసు "చేరి మూర్ఖుని మనసు రంజింప చేయలేమని " అందుకే ఇక్కడ ఎవరూ సమైక్య ఉద్యమాలు చెయ్యరు..చెయ్యాల్సింది ,చెయ్యాల్సిన వారిముందు,చెయ్యాల్సిన టైంలో చేస్తారు..
సరే మేము చేసే సమైక్య ఉద్యమం హైదరాబద్ కోసమే అనుకొండి..మీకు మత్రం హైదరాబద్ వద్దా..క్రిష్నా , గోదావరి జాలాలు తీస్కొని కాచ్మెంట్ ఏరియాలు బాగా అభివ్రుధ్హి చేసి ..కరీమ్నగర్నో , నిజామాబాద్నో , ఒక హైదరాబదులా తీర్చిదిద్దండి..

సత్యాన్వేషి said...

ఆ కొట్టిన వాడు తెలంగానా వదే కావొచ్చు, కానీ వాడికి దబ్బిచ్చి దాడికి ఉసిగొల్పింది ఆంధ్రా వాడే అయ్యుండొచ్చుగా? ఈ బ్లాగుకి సమాధానం... కొట్టిన వాడు స్టూడెంట్ కాదని తెలిసిపోయింది.

ఇకపోతే హైదరాబాద్ విషయం..ఈ ఉద్యమం తెలంగానా కోసం, కానీ హైదరాబాద్ అంధ్రప్రదెష్ ఫాం అవకముందే తెలంగానా కాపిటల్. కాబట్టి అది అందరిదీ అనకండి. అలా అనడం సాధ్యం కాదు కాబట్టే ఆంధ్రా నాయకులు సమైక్య రాగం అందుకున్నారు.

Unknown said...

తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు,
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగ వచ్చు,
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు ...

కొంపతీసి ఇది రాసింది కూడా అంధ్ర పెత్తందారులు,వలసవదులు అంటారేమో..
..........................
Its easy to blame someone for our own inability..

సత్యాన్వేషి said...

ఆ పద్యము ఎవరు రాసినా అది మాత్రం ఇప్పటి సమిక్యాంధ్ర వాదుల తెలివికి సరిగ్గా సరిపోతుంది. ఎక్కడైనా ప్రజలు తమ హక్కులకోసం ఉద్యమాలు చేస్తారు. కానీ చరిత్రలో తొలిసారిగా వేరే వాడి హక్కులను ఇవ్వొద్దని ఉద్యమం చేసింది మాత్రం చరిత్రలో ఇదే తొలిసారి.

అమ్మ ! ఇదేమి చిత్రమొ ! ఇదంతయు నింతగ సత్యమై కనన్ -
ఇమ్ముగ పల్కుచుంద్రు, కడుపెల్లయు నిండగ, జీవితమ్ము ప
బ్బమ్ముగ గడ్పుకొంచు గలవారె ‘సమైక్యత’ యంచు ! నోటిలో
దుమ్మునుబడ్డ వారలిక దోషమె వేర్పడ కంఠమెత్తినన్ ?

Malakpet Rowdy said...

ఇద్దరు దొంగలు ప్రజల ఆస్తి కోసం బాగానే కొట్టుకుంటున్నారుగా :))


LOL Viswamitra BTW

నిజం said...

@Telangana:చాల కరెక్ట్ గా చెప్పారు....
"తనది కాకపొతే తాడిమట్టకు ఎదురు డేకమని"

విశ్వామిత్ర said...

@ మలక్‌పేట రౌడీ
మీరీమధ్య కనబడటంలేదేనని అనుకున్నాను. :)

@తెలంగాణా:
"తమది కాకపొతే తాడిమట్టకు ఎదురు డేకమనడం" అంటే తమకొక సూత్రం ఎదుటివారికొక సూత్రం అనే అర్ధం చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పింది కేవలం కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన చర్చలగురించి మాత్రమే.

రెండోది నేను సమైక్య ఆంధ్రా ఉద్యమాన్ని ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో ఎప్పటికీ పోల్చను. ఆంధ్రాలో బొత్సా రాజీనామా చేయనని చెప్పినా అక్కడ నిరశన తెలిపారేగానీ దౌర్జన్యం చేయలేదు. పరిపాలన స్థంభింప చేస్తామన్నారేగానీ ఆటం బాంబులు పేలుతాయని బెదిరించలేదు. ఆక్కడ నాయకులెవ్వరూ ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. కాబట్టీ రెండూ వేర్వేరు. తెలంగాణాలోది ప్రజా ఉద్యమం ఆంధ్రాలోది పెట్టుబడి ఉద్యమం అనేది కేసీఅర్ మార్క్ మాటలు. అంటే పిచ్చిమాటలు.

తెలంగాణాలో అందరూ ఆంధ్రోళ్ళు దోచుకుతింటున్నరని అంటారు. ఏ ఒక్క ఆంధ్రుడైనా మీ ఇంటికి వచ్చి ఒక్క ముద్దన్నా తిన్నాడా? :) ) ఇలా ప్రశ్నిస్తే మీగురించి కాదు పెట్టుబడిదార్లగురించి అంటారు. హైరబాదులో స్థిరపడినవాళ్ళు లక్షలలో ఉంటే పెట్టుబడిదారులు వందల్లోకూడా లేరుకదా? మరి ఇవి కేఅసీఅర్ మార్క్ మాటలే కదా? హైదరాబాదు ఆంధ్రాలో భాగంకాబట్టి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. పులకేసీలు పుట్టుకొచ్చి ఇలా వేరు చేస్తారని తెలిస్తే వచ్చేవారేకాదేమో!


@కరన్
నేను అనేదికూడా అదే. బస్సులను పగులగొట్టేవాళ్ళుగానీ తగులబెట్టేవాళ్ళుగానీ నాకు విద్యార్ధుల్లా కనబడట్లేదు. వాళ్ళని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో నిజాలు వెలికి తీయాలి.

ఇక మీడియాలో టీవీ-9 రెండుగంటలకు పైగా కేసీఅర్‌తొ షెడ్యూల్డ్ కార్యక్రమాలు పక్కనబెట్టి మరీ ప్రసారం చేసింది. ఇది స్పాన్సర్‌డ్ కాయక్రమమా లేక టీవీ-9 ఉత్సాహమా? దీనికి సమాధానం ఏదైనా కూడా మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

సత్యాన్వేషి said...

@ విస్వమిత్ర

మీడియా జనానికి ఏది ఇంటరెస్టుగా ఉంటుందొ అది చూపిస్తుంది. వాల్ల వ్యాపారం వాల్లకు ముఖ్యం. మరి తెలంగానా వాల్లయినా, ఆంధ్రా వాల్లయిన కేసీఆర్ మాటలను వినాలనుకొంటున్నారు ఇప్పుడు, కానీ ఎవ్వడూ బోరు కొట్టే చిరంజీవి ప్రసంగాలు, లగడపాటి మాటలు వినాలనుకోవట్లే. కొంచెం గ్రహించండి