December 30, 2009

తెలంగాణా పులకేసికి "బందుమిత్ర" బిరుదునివ్వాలి!!


ప్రస్తుతం తెలంగాణాలో బందుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణాపై సష్టమైన ప్రకటన వెలువడేదాకా ఈ పర్వం కొనసా.....గుతుందని నాయక గణం అంటోంది. బందులో ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, ఉద్యోగులు, స్వచ్చందంగా పాల్గొంటున్నారని సదరు నాయకులు చెపుతున్నారు. స్వచ్చందముగ అంటే భయముతో అని అర్ధం చేసుకోవాలిగాబోలు. విద్యాసంస్థలపైనా, చిన్నపిల్లలతోవెడుతున్న స్కూల్ బస్సులపైన కూడా ముష్కరులు కొన్ని రోజులముందే దాడి చేయడంతో విద్యాసంస్థలు మూసివేయక తప్పని పరిస్తితి. అందుకే వారు స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఎన్నొ వ్యాపార సంస్థలపైన కూడా దాడిచేసి దోచుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అందుకే వారుకూడా స్వచ్చందముగా దుకాణాలు మూసి స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వముకూడా స్వచ్చందముగా బందులో పాల్గుంటోంది. ఎందుకంటే ఆర్టీసీ నష్టాలు భరించే స్థితిలో లేదు లాభాల మాట దేముడెరుగు, సంస్థ ఆస్తులే హరించిపోతున్నాయి కాబట్టి వారుకూడా స్వచ్చందముగా బందులో పాల్గొన్నట్టే. ఇక రైల్వేలు కూడా తమ రైళ్ళను నిలుపు చేసి తెలంగాణాకు అనుకూలంగా బందులో పాల్గొన్నయని భావించవచ్చు.

కానీ ఇన్ని సంఘటనలు జరుగుతున్నా టీవీ చానల్స్ మూగనోముతో కేవలం స్క్రోలింగ్‌లతో సరిబెట్టుకోవలసిన పరిస్తితి వచ్చింది. పాపం హైకోర్టు వారి మైకు, కెమేరాలను కొంత అదుపులో ఉంచమని ఆదేశించడమే దీనికి కారణం.అంతేకాకుండా వారి ప్రసారాలపై కొంత నిఘా ఉంచమని పోలీసులకు కూడా అదేశాలు ఇచ్చింది. లేకపొతే వారంతా వీరావేశంతో "జజ్జనకరి జనారే" అంటూ చిందులేసేవారు.

ఇన్ని విపరీతాలకి కారణమైన మన పులకేసిగారికి ఈ సందర్భములో ఒక బిరిదునిచ్చి సత్కరించాలని నా కోరిక. దానికి నేను రెండు పేర్లను ఎంపిక చేసాను. మొదటిది "బందుమిత్ర" రెండోది "బందోపాధ్యాయ". వీటిల్లో ఎక్కువ మంది ఎంపిక చేసిన పేరును వారికి బిరుదుగా ప్రదానం చేయవచ్చు.

ఇక తెలంగాణా విషయానికి వస్తే (అమాయక) విద్యార్ధులు, ప్రజలు విభజనవల్ల తమకు ఉద్యోగాలు వస్తాయని తమ బ్రతుకులు మెరుగవుతాయని భావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఓయూలో మెస్‌లు మూసివేసినప్పుడు తమకు భొజన ఏర్పాటు చెయమని విద్యార్ధులు రాజకీయ నాయకులను అడిగారని ఒక బ్లాగులో చదివాను. ఇలాటి సంఘటనలు ఎవరినైనా కదిలిస్తాయి. కానీ ఒక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రావారిని పిలిచి ఇచ్చెయ్యలేదు. పోటీ పరీక్షలలో ఎంపికైనవాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ తాము మిగిలినవారితో పోటీపడలేమనుకున్నప్పుడు దానికొక పరిష్కార మార్గాన్ని చూడవలసిన అవసరం ఉంది. ప్రజలు నిజంగా తాము వెనుకపడ్డామని భావిస్తున్నప్పుడు కూడా నిజానిజాలు తెలుసుకొని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇరుపక్షాలకు నష్టం లేనివిధంగా సమస్యను పరిష్కరించాలి. వృద్ధ జంబూకాలకు వేదికగా మారిన జేయేసీ దృష్టి రాబోయే పదవులపైనే ఉంది అన్నది సుస్పష్టం. కూర్చుంటే లేవలేని ఒక నాయకుడు అయితే గియితే వచ్చే తెలంగాణాకు ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తామని ఎవరో మాటిచ్చారట ఆయన తిరస్కరించారుట. వీరి మాటల్లో ప్రజాభావాలకన్న పార్టీ భావాలే వ్నిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రాతినిద్యం లేని నిజమైన ప్రజాప్రముఖులను కూర్చొబెట్టి సమస్యను పరిష్కరించగలిగితే బాగుండును. కానీ అలా జరగడానికి అవకాశం ఉందా?

24 comments:

రాజ్ కుమార్ said...

i vote for "Bandopaadyaya."

Vidyaranya said...

ఉద్యోగాలు మీరన్నట్లు పోటీ పరీక్షలు రాసి, ప్రతిభను ప్రదర్శించినవారికే వస్తాయి.కానీ,పాపం కొందరు అల్పజీవులు ఉంటారు. ఏదో ఇంత ఇంటర్,టిటిసి చేసి చిన్న బడిపంతులు ఉద్యోగం చేసుకొని బకుదామని ఆశ పడతారు.వారికి వారివారి జిల్లాల్లో ఉండే మన ప్రభుత్వం వారు ఎలెక్షన్స్ ముందు పెట్టే ఉద్యోగాలజాతరలో ఉద్యోగాలు రావాలి. అవేమో పరిమిత సంఖ్యలో ఉంటాయాయె. వేరే జిల్లాల్లోకేమో(ఈ అమాయకులకు)వెళ్ళరాదాయె. అయ్యా! అక్కడుంది కిటుకు. "ఆ స్థానిక ఉద్యోగాల్లో" ఆ జిల్లావాడుకాని అస్మదీయులు ఉద్యోగాలు సంపాదిస్తారు. పాపం ఈ అమాయకజీవి మరోసారి రాయలసీమ మారాజు గారో, కోస్తా మారాజుగారొ వచ్చే ఎలెక్షన్స్ ముందు ప్రకటించే అబద్ధపు,తనకు రాని ఉద్యోగం కోసం చొంగ కార్చుకుంటూ కూర్చొంటాడు.
( మీకేమైనా సందేహముంటే,హైదరాబాద్ దగ్గరలో ఉన్న మెదక్ జిల్లాలో చూడండి. ఎంతమంది తెలంగాణేతరులున్నారో(స్థానిక ఉద్యోగాల్లో) తెలుస్తుంది. ఇదైతే అబద్ధం కాదుగా?)

విశ్వామిత్ర said...

విద్యారణ్యగారూ

మీ అందరి అలోచనల్లో ఎక్కడో తేడా ఉంది. మీరు చెప్పింది వ్యవస్తలోని లోపాలు. ప్రత్యేక తెలంగాణా ఇచ్చినా ఖచ్చితంగా మీరన్న సమస్య పోతుంది అని చెప్పలేరు. అన్ని సమస్యలకు మూలం ఒక్కటే అన్న భ్రమలో ఉన్నారు. మీరు చెపుతున్న కష్టాలు దేశంలో అన్ని ప్రాంతల్లొ ఉన్నాయి. కేవలం తెలంగాణలోనే కాదు. మీ భ్రమలు తొలిగే రోజు వస్తుందిలెండి. మీ ఆలోచనా ధోరణి మర్చుకోలేకపొతే మీ పోరాటం ఎప్పటికీ ఉంటుంది. ఎటొచ్చి మీరు చెప్పే బూచులు (ఇప్పుడు ఆంధ్రోళ్ళూ) మారుతూ ఉంటారు.

విశ్వామిత్ర said...

నేను అమాయకులు అన్నది ప్రత్యేక రాష్ట్రం వస్తే వారి పరిస్తితి మారుతుందని అనుకుంటున్నందుకు. మీ కామెంటు చెరిపివేసేటంత మూర్ఖత్వం మాకు లేదులెండి.మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా చెప్పవచ్చు. :)

Vidyaranya said...

విశ్వామిత్రగారూ!
మొదటగా మీ సమాధానాన్ని ప్రచురించిన సహృదయతకు ధన్యవాదాలు. మీరు దాన్ని ప్రచురించరేమోనని నా బ్లాగ్‌లో బ్లాగా. నాకు అలాటి అనుభవాలు ఉన్నాయి లెండి.

ఇక మీరన్నారు.."అన్నిటికీ ఒకే పరిష్కారమనుకునే మాది ఒక భ్రమ" అని. మీకూ తెలుసండీ, అన్నీ ఉపాయాలు (పెద్దమనుషుల ఒప్పందం, 610 జి.వొ., ఆరు సూత్రాల పథకం మొ.)ఆశ్రయించి, దీర్ఘకాలం(దాదాపు 50 ఏళ్ళు) వేచి చూసాకే...ఇక లాభం లేదనుకుని, ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాము. గోటితోనే పోయి ఉంటే మేమైనా గొడ్డలిని ఎందుకు పడతాం?

మరోమాట. మేమేమీ ఆంధ్రావాళ్ళనందరినీ వెళ్ళగొడతామనో, వారిని ఇబ్బంది పెడతామనో అంటూ లేము. అందుకే కదా మీరూ ధైర్యంగా మాతోనే కలిసి ఉంటామంటున్నారు? కేవలం సూత్రప్రకారంగా మాకు రావాల్సినవాటిని మేము సాధించుకుంటామంటున్నాము. మీతో అయితే మీరు కుదురనివ్వడం లేదు. ఉదా:- మొన్న తెలంగాణాలోకంటే ఆంధ్రా ప్రాంతంలోనే ఎక్కువ ఆందోళనలు జరిగాయి. విధ్వంసాలూ అంతే. కానీ కేసులు మాత్రం తెలంగాణలోనే ఎక్కువ నమోదు చేసారు. (ఇవన్నీ సక్షాత్తు రోషయ్యగారి రజాకార్ల పెద్దకొత్వాలుగారు పత్రికల్లో చెప్పిన లెక్కలు) ఇదీ ఆంధ్రపాలకుల సమదృష్టి. ఇక చెప్పండి...మేమెలా ఆలోచించగలుగుతామో?
అవును.నిజమే మీరన్నది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.భూతాలే మారుతాయి. నిజాం పాలన అంతమొందుతే స్వతంత్రులమౌతామనుకున్నాం. కానీ, అభినవ బ్రిటీష్‌వారి బారిన పడ్డాము.

విశ్వామిత్ర said...

ఆంధ్రోళ్ళని ఉండనివ్వడం ఉండనివ్వకపోవడం మీ చేతుల్లో లేదు. మీరు కూడా సాధారణ ప్రజల్లో ఒకరు. మహా ఐతే ప్రస్తుతం ఉద్యమకారుల్లో ఒకరు. తరువాత మీ మాట వినేదెవ్వరు చెప్పండి. వృద్ధ జంబూకాల పోరాటం మొదలయిందికదా! తరువాత నాటకం అంతా వారిదే.

Chandamama said...

సమైక్యా ఆంధ్ర వాడైనా, తెలంగాణా వాడైనా ఈసారి 'బంధు' అన్నవాడి నవ రంధ్రాలు బందిచేయ్యాలి!
రాజకీయ నాయకులనే సెలైన్లు ఇవ్వకుండా నిరాహార దీక్షలు చెయ్యమంటే సరి! ఎన్నాళ్ళు చేస్తారో చూడాలి!

విజయ్ said...

ఇక్కడ ఎవరూ కూడా తార్కికంగా ఆలోచించటం లేదు. మనం అందరం ఒక్క తల్లి బిడ్డలమే అయినా కానీ ఇలా కుక్కల్లా కోట్లాడుకోవడం మాత్రం ఏమి బావో లేదు. రాజకీయాల్లో సరైన పరిష్కారం లేదా తప్పు పరిష్కారం అంటూ ఉండవు. కేవలం మన సౌలబ్యం కోసం మనం అందరికీ అమూదయోగ్యం ఐన పరిష్కారం కనుక్కోవటం మాత్రం కావలి. ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని మనమే కరెక్ట్ అనుకునే నైజం పోవాలి. ఆంద్ర వాళ్ళు పోగారుబోతులని, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులని ఇలాంటి gross generalizations చేసుకోవటం మన అవివేకం కాదా? మనవ సంబందాలు తెగిపోయాక ఇక కలిసున్నాలేకపోయినా పెద్ద లాబం లేదు. ఉద్యోగాల్లో, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది (వాళ్లకి తెలివితేటలూ ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే) అన్న విషయం వాస్తవం. అలాగే హైదరాబాదు అభివృద్ధిలో అందరి చేయి ఉంది, కానీ ఇప్పుడు దానిని వదిలెయ్యాలి అనటం పూర్తీ గా అన్యాయం. ఇలాంటి పరిస్తితులలో చదువుకున్న మనం ప్రస్తుతం సంయమనం పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పాటు పడేలా ప్రోత్సహించాలి. అంతే కాని రోజు రోజుకి పడిపోతున్న సౌబ్రాతుత్వాన్ని మరింత తొక్కి మనకి మనం ఏమి మంచి చేసుకోవటం లేదు. Negotiations అందరికి అన్ని లాబాలు జరగవు, మనం కొన్ని పక్కవారి విషయంలో పస ఎంత ఉంది అనేది అలోచించి సర్దుకు పోవడం ముఖ్యం. అన్నింటి కన్నా ముఖ్యం, ఇది జీవన్మరణ సమస్య కాదు. కాని మనల్ని మనం కించ పరుచుకుమ్తున్న విదానం మాత్రం హేయం. అందరం కలుద్దాం పరిష్కారం వెతుకుదాం. రాజకీయంగా కాదు. బ్లాగు పరంగా. ఏమంటారు? కనీసం ఇక్కడైనా మనం వివేకులం అని చెప్దాం. సరైన బ్లాగ్ తయారు చేద్దాం, ఫోరం తయారు చేద్దాం, అందరికి నచ్చేట్టుగా నాయకులను (moderators) ఎన్నుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా మనకి మనం పరిష్కారం చర్చిద్దాం. ఇది నేను అన్ని బ్లాగులలో పోస్టు చేస్తున్నాను. దయచేసి అందరం దగ్గరికి వద్దాం. విషం చిమ్ముకోవటం ఆపేద్దాం.

karthik said...

ఈ విష ప్రచారం ఆపేయండి అని నేను నా బ్లాగులో రాస్తే ఒకాయన ఎవరో నావి మొసలి కన్నీళ్ళు అని తిట్టిపోయాడు..
ఇంత జరిగాక కలిసిఉండటం అనేది అసంభవం.. కనుక వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి

విశ్వామిత్ర said...

@ చందమామ
ఐతే మీకో మంచి వార్త. కేసీఅర్ అవసరమైతే మళ్ళీ దీక్షలో కూర్చుంటానని ఇప్పుడే ప్రకటించారు. మరి మీ ఇష్టం :)

@ విజయ్
నేను విమర్శించేది రాజకీయ పోకడలనే. మీ రాతలలోనే విభిన్న కోణాలు ఉన్నాయి. అవన్నీ కూడా తూర్పూ పడమరలే. అవన్నీ ఒక దిక్కుగా నడిస్తే సమస్యే లేదు కదా! ప్రయత్నించి చూడండి, నేనూ మీ వెంట ఉంటాను :)

Shashank said...

కొత్త రాష్ట్రం వస్తే automaticగా ఉద్యోగాలు చెట్లకి మొలుస్తాయి అని ఒక మహానుభావుడు.. బందుబాబు అన్నారు. ఎలా? అని నేను ఎంత ఆలోచించినా బోధపడలేదు. పైపెచ్చు ఈ బందులు చెయండాలం వళ్ళ ఉన్న పరిశ్రమలు కూడా భాగ్యనగరం నుండి కల్టీ కొట్టే అవకాసం ఉంది. ఉన్నది పాయే _____ పాయే అన్నట్టు ఔతుందేమో అని నా భయం. తెలంగాణా వాళ్ళకి వారి వారి జిల్లాల్లు ఉన్నాయి.. కోస్తా వాళ్ళకీ వారి వారి జిల్లాల్లు ఉన్నాయి.. హైదరాబాదే దిక్కు మొక్కు గా భావించే నాలాంటి వాళ్ళ సంగతి ఎంటీ? ఇప్పుడు మళ్ళా యే బెంగళూరో "heaven on earth" మద్రాస్ కో వెళ్ళి ఉద్యోగాలు చేస్కోవాల్సి వస్తుంది.

Shashank said...

మర్చేపోయా - బందుమిత్ర కే నా వోటు. ఆ పేరే ఎన్నుకోకపోతే నేను మీ చేత ఆమరణ నిరాహారదీక్ష చేయిస్తా..

విశ్వామిత్ర said...
This comment has been removed by the author.
విశ్వామిత్ర said...

@ శశాంక్

టాపిక్ మారిపోతోందండీ. వోట్లు వెయ్యండీ అంటే మళ్ళీ వాదనలు మొదలయ్యాయి. ప్చ్!!

మీరు దీక్ష చేస్తానంటే నింస్‌లో సాంబరు ఇడ్లీ, సెలైన్, ఇంకా టీఫీస్ అదేదో అన్నారుగా సిద్ధం చేయిస్తాను :)

శరత్ కాలమ్ said...
This comment has been removed by the author.
శరత్ కాలమ్ said...

మిమ్మల్ని ఖండిస్తున్నాను అధ్యక్షా! బందుల వల్ల వదలకొద్దీ లాభాలు వున్నాయి. అది మీరు గమనించాలి. యు ఎస్ లో బదులు లేక రోజూ ఆఫీసుకి ఏడ్చుకుంటూ వస్తున్నాం. ఇండియాలోలాగా బందులు వుంటే హాయిగా ఇంట్లో తొంగొని ఎన్నో రోజులు TV9 చూస్తూ వుండేవాడిని కదా. అలా అలా ఎన్నొ లాభాలు వున్నాయి. నిరవధిక బందులయితే ఇంకా బెటరూ. ఇంట్లో ఎంచక్కా ఎన్నో రోజులు కాళ్ళు జాపుకొని ముసుగు తన్నేయొచ్చు. నిరవధికంగా కామెడీ న్యూస్ ఛానల్స్ చూసేయ్యొచ్చు.

అలాంటి ఎన్నో ప్రయోజనాలు వున్న బందులని ఖండిస్తున్న మిమ్మల్ని అడ్డంగా ఖండిస్తున్నాను అధ్యక్షా!

Sravya V said...

నా ఓటు "బందోపాధ్యాయ" కే :)
@శశాంక్ హైదరాబాదే దిక్కు మొక్కు గా భావించే నాలాంటి వాళ్ళ సంగతి ఎంటీ? >> నా ఏడుపు
కూడా అదే . ఈ తతంగం అంతా చూసి నా ప్లాన్ మార్చేసి ఇక్కడ PR కి అప్లై చేసేసా :(

విశ్వామిత్ర said...

శరత్‌గారూ...
కొన్ని రోజులు మన పులకేసిని యుఎస్ కు పంపమంటారా? ఏ విషయంపై బందు చేయాలో ఎలా చెయాలో తర్ఫీదు ఇప్పిస్తాను :)) మీరు వోట్ చేయలేదు :(

శ్రావ్యగారూ

మీ వోటును పరిగణలోకి తీసుకున్నాము. :)

Shashank said...

@శ్రావ్యా - మీలాగే ఇంకొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ప్ల్యాన్లు మార్చుకుంటూన్నారు. నేను మార్చుకోదల్చుకోలేదండి. ముందైతే ఆ దేశం చేరి.. తర్వాత హైదరాబాదు గురించి ఆలోచిద్దాం అని డిసైడ్ అయ్యాము. అంతగా ఐతే కొద్ది రోజులు (అంటే యేళ్ళు) వేరే ఊర్లో ఉండి మెల్లిగా మన ఊరు చేరుదాం అని...

@విశ్వ - స్వారీ. మీ టపా ని టపా-జాక్ చేసా.

Vidyaranya said...

శశాంక్‌‌గారూ!
మీరలా ఆవేదన చెందనవసరం లేదు.మీ ఉద్యోగాలకేం ఢోకా లేదు. ఆ మాటకు వస్తే, ఎవరి ఉద్యోగాలకూ ఢోకా లేదు.హైదరాబాదే స్వర్గంగా హాయిగా గడిపేయవచ్చు. మీరు బెంగళూరుకు,మద్రాస్‌‌కు ఉద్యోగానికి సిద్ధపడినట్లే తెలంగాణా వచ్చినా హైదరాబాద్‌‌లోనూ ఉద్యోగం చెయ్యవచ్చు.ఇక్కడ అడుగుతున్నది సీమాంధ్రులను వెళ్ళగొట్టమని కాదు. "మా ప్రాంతంపై పాలనాధికారం మాకే ఇయ్యండ"ని మాత్రమే.

ఇక ఉద్యోగాలు పుట్టుకనైతే రావుగాని, ఉన్న ఉద్యోగాలు గద్దల్లా తన్నుకు పోవడానికి మాత్రం రాదు.

ఇక `బందుమిత్ర'పై నాకో సందేహం.నిజంగానే బందులవల్ల చాలా ఇబ్బందులున్న మాట వాస్తవమే. కాని, ఈ అసహనం మీకు ఇప్పుడే కలుగుతుందా? సమైక్యాంధ్ర ఉద్యమకాలంలోనూ కలిగిందా? లేక మొదటి తెలంగాణా ఉద్యమంలో కలిగి మధ్యలో సమైక్యాంధ్రకాలంలో విశ్రాంతి పొంది మళ్ళీ ఇప్పుడు జూలు విదిల్చిందా? ఇది ఎవరికివారు గుండెలమీద చెయ్యి వేసుకొని, జవాబు చెప్పుకోవాల్సిన అంశం.

Vidyaranya said...

శశాంక్‌‌గారూ!
మీరలా ఆవేదన చెందనవసరం లేదు.మీ ఉద్యోగాలకేం ఢోకా లేదు. ఆ మాటకు వస్తే, ఎవరి ఉద్యోగాలకూ ఢోకా లేదు.హైదరాబాదే స్వర్గంగా హాయిగా గడిపేయవచ్చు. మీరు బెంగళూరుకు,మద్రాస్‌‌కు ఉద్యోగానికి సిద్ధపడినట్లే తెలంగాణా వచ్చినా హైదరాబాద్‌‌లోనూ ఉద్యోగం చెయ్యవచ్చు.ఇక్కడ అడుగుతున్నది సీమాంధ్రులను వెళ్ళగొట్టమని కాదు. "మా ప్రాంతంపై పాలనాధికారం మాకే ఇయ్యండ"ని మాత్రమే.

ఇక ఉద్యోగాలు పుట్టుకనైతే రావుగాని, ఉన్న ఉద్యోగాలు గద్దల్లా తన్నుకు పోవడానికి మాత్రం రాదు.

ఇక `బందుమిత్ర'పై నాకో సందేహం.నిజంగానే బందులవల్ల చాలా ఇబ్బందులున్న మాట వాస్తవమే. కాని, ఈ అసహనం మీకు ఇప్పుడే కలుగుతుందా? సమైక్యాంధ్ర ఉద్యమకాలంలోనూ కలిగిందా? లేక మొదటి తెలంగాణా ఉద్యమంలో కలిగి మధ్యలో సమైక్యాంధ్రకాలంలో విశ్రాంతి పొంది మళ్ళీ ఇప్పుడు జూలు విదిల్చిందా? ఇది ఎవరికివారు గుండెలమీద చెయ్యి వేసుకొని, జవాబు చెప్పుకోవాల్సిన అంశం.

Shashank said...

విద్యారణ్య గారు - మా ఉద్యోగాలకి మీరు హామి ఇస్తారా? ఇప్పుడు ఈ గొడవల వళ్ళ మకాం మార్చిన కంపనీలు.. వాటిలో ఉద్యోగాలు ఎక్కడ నుండి వస్తాయి ఇప్పుడు హైదరాబదు కి? ఎట్ల తెస్తారు? ఏమైన అంటే అన్నారు అంటారు కాని మీ ప్రాంతం మీద ఇప్పుడు ఎవరు అధికారం చలాఇస్తున్నట్టు? పోని తెలంగాణా వచ్చాక కొత్త రాజకీయవేత్తలు పుట్టుకొస్తారా వచ్చి తెలంగాణా ని ఓ యభై యేళ్ళల్లో ఓ మినిమం సింగపూర్ లాగా చేస్తారా? అరవైయేళ్ళైంది స్వతంత్రం వచ్చి దిల్లీ కే దిక్కులేదు..

కొత్త ఉద్యోగాల గురించి దేవుడేరుగు ఇప్పుడు ఉన్నవాటికే దిక్కులేవు. బందులు గట్ర వళ్ళ ఒక్కో కంపనీ కి ఎంత నష్టమో మీకు తెలుసా? అలా అంత నష్టాల్లో ఉండి హైదరబాదునో ఆంధ్ర దేశాన్నో ఉద్దరించాల్సిన అవసరం వాళ్ళకి లేదు.

"లేక మొదటి తెలంగాణా ఉద్యమంలో కలిగి మధ్యలో సమైక్యాంధ్రకాలంలో విశ్రాంతి పొంది మళ్ళీ ఇప్పుడు జూలు విదిల్చిందా? ఇది ఎవరికివారు గుండెలమీద చెయ్యి వేసుకొని, జవాబు చెప్పుకోవాల్సిన అంశం." - ఎవ్వరి గుండె మీదైన చేయి వేసి చెప్త.. నాకు బందులు ససేమిర నచ్చవు. ప్రజలకి ఇబ్బంధి కలిగించేవి ఏది నాకు ఇష్టం లేదు.... అల చేసేవాళ్ళని రోడ్ మీదకి లాగి చితకొట్టాలి అని ఉంటది. ఇప్పుడు ఈ ముప్ఫై రోజుల బందులకి మూలపుర్షుడు ఎవరో మీకు తెలీంది కాదు.

ఒక్క చిన్న కొట్టు వాడు పది రోజులు దుకాణం తెరువక పోతె ఎంత కష్టమో "తెలంగాణా కి ఆ మాత్రం త్యాగాలు అవసరం" అని మీరన్న అనుకున్న.. పూట గడవని వాడి ఆవేదన ఉసురు ఊరికే పోదు. నెలజీతగాళ్ళకి ఏం తెలుస్తుంది ఒక్క రోజు వ్యాపారం సరిగ్గ జరగకపోతే ఎంత కష్టమో అని. అలాంటిది పది ఇరవై రోజులు దానికి తోడు పొరబాటున వాడు వేరే చోట నుండి వచ్చి వాడి రాజధానిలో పెట్టుకొని ఉంటే కొట్టు తెరిస్తే ఎక్కడ కొల్లగొడతారో అని భయం. ఎవడబ్బ సొమ్ము ఈ దేశం? నేను అస్సాం లో ఐన వ్యాపారం పెట్టుకోవచ్చు.. అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.. పాపాం అలా ఎంతో మంది .. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు.. వాళ్ళ ఇళ్ళలోకి చొరబడి ధంకీ ఇచ్చారు. తెలుసా మీకు? అది ఎంత బాధాకరమైన విషయమో మీకు అర్థం కాదు. యభై యేళ్ళ నుండి ఉండే ఇంట్లోకి ఎవ్వడో ___ నా ____ వచ్చి ఇక్కడ నుండి వెల్లిపో అంటే ఎల ఉంటదో మీకు తెలీదు. whatever may be the political gains noone has ANY right whatsoever to destroy or threaten any citizen of MY county. .

Unknown said...

vidyaranya gariki..
bavundi andi.., medaklo kosta, rayalasema vallu unnaru, bane undi, konni rojulaki telagana vachhina taruvata, medaklo karimnagar atanu untadu.. suppose anukondam, meru cheppina ttc, inter chesukoni wai chestunnadu, so karimnagar vallu vachhi ma vudyogalu dochukupotunnaru, right. medak varaku separate rashtram ichheyandi.., ma medaklo undevallaki job lu kavali.., ye rashtramlo ledandi.., even engineering seats kuda ye university mostly aa universitylone ravali, 15% unnatlu undi, mana rashtram pakka zillaki vellali ante aalochinchalisina paristhithi..., pedda poyediemi ledandi, o sari rashtram ichheste, telangana vaste vallake telustundi....

balu said...

HYd lone putti perigina maa vadianaku kevalam 4 years kostalo chaadivina karanam gaa non local ayyi 3 DSC lu vaduluko valasi vachindi chivaraku akkada DSC lo vachindi meeru anna medak lo non local ela vachindo antha bhrama leka pothe vaallu chinnapatnumchi ikkadea chadivina kostaa vallu ayi vuntaru lekha prakaram vaalu telangana valle