January 1, 2010

జనారణ్యంలో మానవ మృగాలు


వార్తలు చూద్దామని టీవీ పెడితే తెలంగాణా ఉద్యమకారుల ఊరేగింపును చూపిస్తున్నారు. అందరూ కొన్ని స్లోగన్లు ఇస్తున్నారు. వారు చెప్పే స్లోగన్ "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం" అంటూ చాలా రౌద్రంగా అరుస్తున్నారు. వారిలో అణగారిన వర్గానికి నాయకుడిగా చెపుతున్న మందమైన నాయకులు కూడా ఉన్నారు. వారు ఇచ్చే స్లోగన్‌కూడా "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం". ఎవరిని నరుకుతారు? సమైక్య ఆంధ్రాయే కావాలంటున్న ఆంధ్రా ప్రజలనా? లేక సమైక్య ఆంధ్రా కావాలనే ప్రజా ప్రతినిధులనా? ఇప్పటికే ప్రజలమధ్య భావొద్వేగాలు రెచ్చగొట్టి వారిని నిలువునా చీల్చారు. ఇక ఎదుటపడితే నరుక్కునే స్థాయికి నెమ్మదిగా చేర్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్టుగా ఉంది. దానికి ప్రారంభంగా నిన్న రాత్రి నాకు తెలిసిన ఒక యువకుడిని నూతన సంవత్సర వేడుకలు చేసుకొని మరికొంత మందితో తిరిగి వస్తూ ఉంటే ఎల్‌బీ్‌నగర్ పరిసరాలలొ ఒక గుంపు దాడి చేసింది. కేవలం అతదు ఆంధ్రాకు చెందినవాడు కావడమేనట. తోటివారు వారిస్తున్నా కర్రలతో తలపగులగొట్టారు. అతడి తల్లిదండ్రులు ఆంధ్రావాళ్ళే అయినా అతడు పుట్టింది పెరిగిందీ హైదరాబాదులోనే. అతడి తల్లిదండ్రులు ఆంధ్రావారు కావడం అతడి తప్పా? అపస్మారక స్థితిలో అతడిని హాస్పటల్‌కు చేరిస్తే ఏడుకుట్లు పడగా ప్రమాదమునుండీ తృటిలో బైటపడ్డాడు. వీళ్ళు మనుషులా లేక మృగాలా? వీళ్ళు నాయకులా లేక పిశాచాలా? రాష్ట్రాన్ని పీనుగుల పెంటగా మార్చి వీరి అధికార దాహాన్ని తీర్చుకోవడమే పరమావధా? వీరిలో నెమ్మదిగా మానవత్వం నశించి దానవులుగా మారుతున్నారు. ఇంతవరకూ కేవలం ఆస్థులపైనే దాడి చేస్తున్న వీరు ఇకపై మనుషులపైనే దాడిని కొనసాగించదలిచారా? ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడం అంటే ఇదేనా? హైదరాబాదు దానవులకు నిలయంగా మారనుందా? ఆంధ్రాప్రజల రక్షణకు ఢోకా లేదంటున్న తెలంగాణా నాయకుల మాటలు కేవలం గాలిమాటలేనా? వీరి చర్యలకు మానవత్వం సిగ్గుతో తలవంచుకుంటుంది. త్వరలోనే పిశాచాలు రాజ్యమేలడానికి ఇది నాందిగాబోలు.

7 comments:

Bhadrasimha said...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010
ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

Sravya Vattikuti said...

మనుషులు కాదు నిజం గానే మృగాలు . స్వయంగా ముఖ్యమంత్రి పరిస్తితే ఆద్వాన్నం గా ఉంది ఇక మామూలు జనాలు పరిస్తితి ఊహించాలంటేనే భయంకరం గా ఉంది . ఇది నిజం గా మానసిక సమస్య ప్రస్తుతం మతోన్మాదం తో విచక్షణ నశించిన టెర్రరిస్ట్లుల కు వీళ్ళకు తేడా లేదు .

a2zdreams said...

వ్యక్తిగత కక్షలను ఇలా మతం, కులం, ప్రాంతం ముసుగేసి తీర్చుకొవడం సామాన్య విషయమే.

తెలంగాన ఉద్యమానికి హింస మార్గం కాదు. ఇప్పుడు తెలంగాన ఉద్యమం సాగుతున్న తీరు చూస్తుంటే, విడిపొతే మారణహోమం అన్నట్టే వుంది. not good for anyone

సంతోష్ said...

maro india-pakistan controvesry laa tayaravutundemo....

అప్పారావు శాస్త్రి said...

తెలంగాణా రాకుండానే ఇలా చేస్తుంటే తెలంగాణా వచ్చాక ఆంధ్రుల పని శ్రీలంక(జాఫ్నా ) తమిళులు లా అయిపోతుంది.
అసలు వీటన్నిటికీ కారణం పులకేసి గాడే.
"తెలంగాణా వాలా జాగో
ఆంధ్ర వాలా భాగో "
అని రెచ్చ కొట్టాడు సచ్చినోడు.
అయినా వీళ్ళకి ఆంధ్ర అంటే నే కసి. పాపం నిజాం వాళ్ళంటే గౌరవం.విడిపోతే సౌత్ పాకిస్తాన్ అయిపోతుంది.
నేను వ్రాసినవి చూడండి.

prabhakaran said...

basu nuvvu anadhi correct aithe proof chupinchu ledu ante idhi antha vallasvadula trash ani malli cut copy paste chesi manna burra thintaru

renu said...

అవునండి, ఇలాగే జఱుగుతుంది ఎక్కడ గొడవ జఱిగినా దానికి తెలంగాణా రంగు పులుముతున్నారు కొందఱు పనికట్టుకొని ఇందుకు మొన్న రామాంతపుర్లొ జరిగిన సంఘటనకూడా ఒకటి, చఱ్లపల్లిలొ వుండే మా బాబాయి అయన స్నేహితుల శుభకార్యనికని విందు ఏర్పాటు చెయగా మెము రామాంతపుర్ చెరుకున్నాం అక్కడ జరిగిన తతంగం అంతా ఇంతా కాదు ఒక మత ఘర్షణలు జరిగే ప్రదేశంగా మాఱ్చివేసారు అక్కడి వాతవరణాన్ని, అసలు ఏమి జఱిగింది అని ఆరాతిస్థె, ఏక్కడ వేడుక జరిగుతుందొ వాళ్ళ బందు వఱ్గం కొంతమంది స్తానిక స్నేహితులు కలిసి మధ్యం సేవించి వేడుక చెసుకుంటున్నారు మధ్యం మత్తులొ మాట మాట వచ్చి గొడవ జరిగింది ఒకరిని ఒకరు దూషించుకున్నారు గొడవ పెద్దదయి అతన్ని కొట్టారట తాగిన మైకంలొ దెబ్బలు గట్టిగానే తగిలాయి అతన్ని హస్పిటల్లొ చెర్చారు ఇంతవరకు ఒక కథ. ఇక్కడనుంచే అసలు నాటకం మొదలయింది వీధులకు రెండు వైపులకాపు కసారు దొరికిన వాడ్ని దొరికినట్టు వెసెద్దాం అనెపందాలొ సాగింది వ్యవహారం అయితే ఈ విషయన్ని పసిగట్టిన స్తానిక పెద్దలు ఆ కుటుంబం వారు తీసుకున్న చొరవ ముందు జగ్రత్త చర్యల ఫలితంగా చాల పెద్ద ఉపద్రవమే తప్పింది మాకు ఆరొజు లెకుంటే ఏమిజరిగెదొ చెప్పనవసరంలెదు. మెము ముందె బయటకు వచ్చెసాము, వాళ్ళుకూడ చాలమంది అప్పటికే వెళ్ళిపొయారు, విందు కాస్తా విషదంగా మారేఋ సూచనలు కనిపించాయి నాకు, కొట్టినవాళ్ళు శ్రీకాకులంకు చెందినవాళ్ళు, తన్నులు తిన్నవాడు స్ఠానికుడు కావడం ఇంత హంగమాకి కారణం అయింది. ఇక అక్కడి పెద్దలు చూపిన చొరవ సాదరణమయింది కాదు, పోలిసుల సహయంతొ నాటకీయ పరినామల మద్య ఈ గొడవ జరగకుండ ఆపగలిగారు. బయటకి వచ్చిన మాకు ఆశ్చర్యం కలిగించే దౄశ్యం అక్కడకి వాళ్ళు ఏప్పుడు వచ్చారొ గాని N-TV వాళ్ళు కెమెరా మైకు పట్టుకుని సిద్దంగా వున్నారు. ఇప్పుడు చెప్పండి అసలు యెమి జరుగుతుందో ఇక్కడ.