January 6, 2010

జే.పీ పిచ్చ పిచ్చగా నచ్చేశాడు....!!


మొత్తం మీద అనుకున్నట్టుగానే అయింది. ఏదొ జరిగిపోతుందని పేపరోళ్ళు, చానల్స్ జనాన్ని ఎంతో సస్పెన్స్‌లో ఉంచి టీఆర్పీ రేటింగ్ పెంచుకున్నాయి. ఏనుగు పిత్తితే ప్రళయం వచ్చేస్తుందని పారిపోబోతే తుస్సుమన్నదట. అలాగుంది ఢిల్లీ మీటింగ్. మీటింగులో నిర్నయించినది మళ్ళీ మళ్ళీ కలవాలని. అదీ సంగతి. తెలంగాణా ప్రస్తావనే లేకుండా టీచర్ పిల్లలని అడిగినట్టు అడిగి వారు చెప్పింది విని సరే వెళ్ళండి అన్నారు. కానీ చిదంబరం ఏమి మంత్రం వేశారోగానీ రాష్ట్రంలో మాత్రం సత్వరమే శాంతి నెలకొనాలని అందరిచేతా ఒక ప్రఖటన చేయించారు. మీటింగ్ అయినతరువాత సదరు నాయకులు చెప్పిన విషయాలు నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును గురించి వర్నించినట్లు పొంతన లేకుండా చెప్పారు. చిరంజీవి మంచి వాతావరణంలో మీటింగ్ జరిగిందని చెపితే, కాంగ్రెస్ నాయకులు (సమైక్య ఆంధ్రా) పెదవి విరవగా టీఆరెస్ నాయకులు ఇది మొదటి అడుగు అంటూ చెప్పుకొచ్చారు. కానీ మీటింగ్ అయ్యాకా ప్రణబ్ చెప్పిన మాటల "తెలంగాణా ఏర్పాటు అంత సులువు కాదు, అది ఇప్పటికిప్పుడు తేలే విషయం కాదు, కేసీఅర్ ఆరోగ్య రీత్యా అప్పటి పరిస్తితుల్లో ఆ ప్రకటన చేయవలసి వచ్చింది" అని. మొత్తం మీద తెలంగాణా విషయం కొంతకాలం అటకెక్కినట్టే. ఆ విషయం చెప్పడానికి కొన్ని చానల్స్‌కి గానీ టీఆరెస్‌కి గానీ మొఖం చెల్లలేదు. కేసీఅర్ కనీసం కెమేరాలవంక కూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఏ ప్రకటన చేయాలా అని ఆలోచిస్తూ ఉండిఉండవచ్చు.

తెలంగాణా విషయంలో మొదటినుండీ ఎటువంటి తడబాటూ లేకుండా విశాల భావాలతో ఒక సైనికుడిలా తనవంతు కృషిని అవిరాళంగా చేసిన ఒకే ఒక్కడు జయప్రకాష్ నారాయణ్. నిజమైన సైనికుడిలా ఒకే ఒక్కడు ఢిల్లీ పెద్దలను కలిసి వారికి వాస్తవాలను వివరించి ఒక అవగాహనను కల్పించారు. సీమాంధ్ర నాయకులు ప్రజల వాణికి ఒక అదనపు ఆయుధంగా మరేరు. మొత్తం మీద సామరస్య వాతావరణానికి అనువైన పరిస్తితి కొద్దిగా కనిపిస్తోంది. దీనికి కారణం ఎంఐఎం రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం. రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రస్తుతానికి ఉన్న కొద్దిపాటి ఆశ కూడా టీఅరెస్‌కి ఉండదు. అందువల్లే ఈ మౌన ముద్ర.

జేపీ చైప్పిన మరో బంగారు మాట "ఒక పదిహేను రోజులు ఈ చాన్నళ్ళను మూసివెస్తే బాగుండు" ననిపిస్తోంది. ఆ క్షణం కోసమే ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

14 comments:

అప్పారావు శాస్త్రి said...

well said sir

శ్రీనివాస్ said...

well said

వెంకట రమణ said...

15 రోజులే ఎందుకు శాశ్వతంగా మూసిపారేస్తే మన రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. :).

శేఖర్ పెద్దగోపు said...

విశ్వామిత్ర గారూ...ఇప్పటికీ జే.పీ ని తప్పుపట్టే వాళ్ళు చాలా మందే ఉన్నారండి...అది మన దురదృష్టం అనుకోవచ్చు...జే.పీ ఢిల్లీ పెద్దలను కలిసిన విషయాన్ని ఏ ఒక్క చానల్ కూడా హైలైట్ చెయ్యలేదు. ఏదో ఒక వార్తగా వేసి పడేసారు. మనకు చెడ్డవాడిని(నాయకుడు) ఏక్సెప్ట్ చేసినప్పుడు పని చేయని బుర్ర ఓ మంచి నాయకుడని అంగీకరించాలంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తిస్తుంది ఎందుకో అర్ధం కాని విషయం.

చిలమకూరు విజయమోహన్ said...

బాగా చెప్పారు.

సుజాత said...

15 రోజులు కాదు, అసలు న్యూస్ అంటే దూరదర్శనే ఇవ్వాలని ఒక బిల్లు తెచ్చి అన్ని ఛానెల్స్ నీ మూసి పారేస్తే పీడా వదిలిపోతుంది. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిందే మీడియా ఛానెళ్ళు!

రవి said...

సుజాత గారితో ఏకీభవిస్తున్నాను. మొత్తం దేశానికో ఛానెలూ, రాష్ట్రానికో ఛానెలూ.దూరదర్శన్, సప్తగిరీనూ. ఇవి చాలు.

viswamitra said...
This comment has been removed by the author.
viswamitra said...

@ శేఖర్ గారూ...
జేపీకి ఏ విధంగానూ రాజకీయనాయకుడి లక్షణాలు లేవు. అవి లేకపోతే మన జనాలకి నచ్చవుకదా :(


@ వెంకట రమణ, సుజాత & రవి గార్లూ...
ప్రెస్‌బిల్ తెచ్చి వీటన్నిటి పీకలు నొక్కేస్తేగానీ మీరన్నట్టు పీడ పోదు. పిచ్చివాగుడు వాగే రిపోర్టర్లని, రెచ్చగొట్టే నాయకులని ఎప్పటికప్పుడు లోపలేసెయ్యాలి.

అప్పరావు శాస్త్రి, శ్రీనివాస్ & విజయమోహన్ గార్లూ ....
థాంక్స్..!!

శరత్ 'కాలమ్' said...

సుజాత గారితో ఏకీభవిస్తున్నాను.

Shashank said...

sujata garu - correct!!

j.p gaaru annadi correcte.. evaraina KCR ni, TV channels vallani sue cheste bagunu. oo PIL veste for the losses that occurred baguntadi.

Anonymous said...

Thats Perfect..!

చదువరి said...

ప్రసార సాధనాలను మూసెయ్యమనడం కాస్త అతిస్పందనగా ఉందనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంతవరకూ అవి పక్షపాతంతో ఉంటే ఉన్నాయేమో, సంచలనాల కోసం తొందరపడి ఉండొచ్చేమోగానీ, మరీ మూసెయ్యాల్సినంత తప్పు చేస్తున్నాయని నేననుకోను. టీవీల కారణంగానే గదా.. నాయకుల అభిప్రాయాలు, కొందరు మేధావులు, అందరు కుహనా మేధావుల అభిప్రాయాలూ మనకు తెలిసాయి. నామటుకు నాకు, సమస్య పట్ల ఎవరెవరు ఏమేమి ఆలోచిస్తున్నారో తెలిసింది టీవీల వల్లనే!

viswamitra said...

@చదువరి గారూ...
జేపీ అన్న సందర్భం వేరు. ప్రత్యేక తెలంగాణా అంశంలో చానల్స్ అతిగా స్పందిస్తున్నాయి అని అందరూ ఒప్పుకొని తీరాలి. ఇటు తెలంగాణా నాయకులుగానీ అటు సమైక్య ఆంధ్రా నాయకులుగానీ బందు పిలుపులు ఇవ్వడానికి, ఒకరినొకరు చాలెంజిలు చేసుకుంటూ ప్రజలని రెచ్చగొట్టడానికి చానల్స్‌ను వాడుకున్నారు అన్నది నిజం. ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే చానల్స్ అత్యుత్సాహాన్ని తాగ్గించుకోవాలనే సందర్భంలో అని ఉంటారు. ఇది చాలమంది ప్రజల అభిప్రాయం కూడా.