January 9, 2010

ఏ'కాకిలా టీవీ-5'చానల్



మనం అనుకున్నట్టుగానే టీవీ-5 లో అరెస్టులను పత్రికా స్వేచ్చపై దాడి అని, కలానికి సంకెళ్ళు అంటూ కొందరు ఆక్రోసిస్తున్నారు. కానీ ఇక్కడ దాడి చేసింది టీవీ-5 నా లేక ప్రభుత్వమా? ఉల్టా చోర్ కొత్వాల్‌కొ మారా" అన్నట్టుగా పోలీసులు టీవీ-5 పై దాడిచేయడంగా వర్నించడం వారి గడుచుదనానికి పరాకాష్ట. ప్రజలని (ప్రస్తుతం జర్నలిస్టులని)రెచ్చగొట్టడం లో చానల్స్ చాలా నేర్పును గడించాయి. మరి మీ తదుపరి కార్యక్రమం ఏమిటి అంటూ ప్రతీ వాళ్ళని శాయ శక్తులా రోడ్డుమీదకి లాగ చూస్తున్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం గానీ నాయకులు గానీ ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. కానీ గత కొంతకాలంగా వారి మితిమీరిన చేష్టలు ప్రతీవారిని విసిగించాయి. దీనికి ఉదాహరణ రోశయ్య గారిని జర్నలిస్టులు రాత్రి కలవడానికి వెడితే ఉదయం ఆఫీసులో వచ్చి కలవండి అని చెప్పారుట. జర్నిస్టులనుండీ వచ్చే కోరికలని సాధ్యమైనంత వరకూ తీర్చడం ఏలినవార్లకు పరిపాటే అయినా వారిని కలవడానికిగానీ వారికి సంఘీభావాన్ని గానీ తెలిపే నాయకులే కరువయ్యారు. మేధావుల ప్రజల మద్దతును కూడా వారు కోల్పోయారు. ఈనాడు ఏకాకాకిగా మిగలడానికి కారణం వారి స్వయంకృతమే. కానీ కార్యక్రమ నిర్వాహకులతోబాటు యాజమాన్యాన్ని కూడా దీనికి బాధ్యుల్ని చేయాలి. వారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది. టీవీ-5 లో జరిగే చర్చాకార్యక్రమంలో ఎవరో తెలియని మేధావులు పాల్గొంటున్నారు. ఒక మేధావి రష్యా నుండీ వెలువడే వెబ్‌సైట్‌లో రిలయన్స్ అధినేత పేరు ఉందిగాబట్టి సుమోటాగా తీసుకొని వారిపై కేసుపెట్టాలి్‌గానీ టీవీ-5 పై కేసుపెట్టడం అన్యాయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి భజనపరులను చేర్చుకొని మద్దతును కూడగట్టుకోవడం కన్నా చేసిన తప్పును ఒప్పుకొని ఇలాటి పొరపాట్లు చేయమని ఒప్పుకొని బైటపడితే వారికి మంచిది. ఇంత గొడవ జరుగుతున్నా మిగిలిన న్యూస్ చానల్స్ చక్కగా పాటలు, వంటలు ప్రసారం చేసుకుంటున్నాయి.టీవీ-5 కూడా వారి వాణిజ్య ప్రకటనలు యదాతధంగా ప్రసారం చేసుకొంటోంది. అంతా మీడియా మయం. ఉష్!!


No comments: