January 3, 2010

రాష్ట్రంలో రాష్త్రపతి పాలన తప్పదా?


నిన్న కొంతమండి పాత్రికేయ మితృలతో చిన్నపాటి గెట్-టుగదర్ జరిగింది. పిచ్చాపాటి నడుస్తూఉంటే ఒక సీనియర్ పాత్రికేయునికీ ఫోన్ వచ్చింది. అతడు "యాభై ఏళ్ళనుండి కలిసి ఉన్నాము. దానివల్ల మంచే జరిగిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను సమైక్య ఆంధ్రాయే కావాలంటాను" అని చెప్పాడు. దానితో నాకు కొంత ఉత్సుకత కలిగి దెనిగురించి మీ అభిప్రాయం చెపుతున్నారు అని అడిగాను. "ఒక పొలిటికల్ పార్టీ కొంతమందినుండీ అభిప్రాయ సేకరణ చేస్తోంది , దానికి నన్ను అడిగితే నేను నా ఉద్దేశ్యం చెప్పాను" అన్నాడు. అతడు తెలంగాణాకు చెందిన వ్యక్తే. ఐనా అతడి సమాధానం నాకు ఆశ్చ్యరం కలిగించింది. "అదేమిటి మిడియా లో అందరూ తెలంగాణాకు సపోర్ట్ చేస్తున్నారుగా?" అని అడిగితే "అందరూ కాదు " అన్నాడు. "మరి చానల్స్ అన్నీ కేసీఅర్ చుట్టూ తిరిగుతూ మంచి కవరేజ్ ఇస్తున్నాయి కద" అన్నాను. " అవునుగానీ అది ఒక భయంతో" అన్నారు. "మరి చాలామంది పాత్రికేయులు బహిరంగంగానే తమ మద్దతు తెలియచేస్తున్నారు కదా" అన్నాను. "దానికి కూడా ఒక కారణం ఉంది. పేపర్లన్నీ ఆంధ్రావాళ్ళవే. అదే వారి కోపానికి కారణం" అన్నాడు నవ్వుతూ. "మరి వారివద్ద పనిచేయడం ఇష్టం లేనప్పుడు మానియేవచ్చుకదా?" అని అడిగాను. "నేను అదే అడుగుతాను, అందుకే నా మాటలు వారికి నచ్చవు" అన్నారు ఆయన. "అంతే కాదు దేవులపల్లి అమర్‌ను కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసింది వైఎస్సార్. అకాడమీ చైర్మన్ గా ఉంటూ ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపినప్పుడు అతనిని కూడా చైర్మన్‌గా రెజైన్ చేసి తెలంగాణా కోసం ఫైట్ చేయమని చెప్పాను. కాని పదవులని ఎవరు వదులుకుంటారు?' అన్నారు ఆయన. ఆ సీనియర్ పాత్రికేయుని పేరు చెప్పడం సబబు కాదని చెప్పట్లేదు. పాత్రికేయ సంఘాలలో మంచి పదవులే నిర్వహించారు ఆయన.

ఇక విద్యార్ధి గర్జన విషయానికి వస్తే జన సమీకరణ బాగానే చేసినా సభ నిర్వాహాణలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోర్టు వారు ఆదేశించినట్టు విద్యార్దులే కాకుండా ముసలి విద్యార్ధులు కూడా సభలో పాల్గొన్నారు. నాకెందుకో ఉద్యమం కేసీఅర్ చేతిలోనుండీ నక్సలైట్ల చేతుల్లొకి పోయిందనే మాటలు నిజమేననిపించింది. దానికి కారణం నక్సలైట్ సానుభూతి పరులు వేదికపై సింహభాగం ఆక్రమించడం. విద్యార్ధులు రోశయ్య గారికి చంద్ర బాబుకి అల్టీమేటం ఇచ్చారు. తెలంగాణాను వ్యతిరేకించే పార్టీల కార్యాలయాలు కూలగొడతామని వాళ్ళు హెచ్చరించారు. పండుగలకు ఆంధ్రా వెళ్ళే ముప్ఫై లక్షల ఆంధ్రా వాళ్ళను తిరిగి రానివ్వమని హెచ్చరించారు. హైదరాబాదులో ఉండే ఆంధ్రావాళ్ళు చాలా కొద్దిమందేనని కేసీఅర్ గారు ఒక సందర్భంలో చెప్పారు. మరి వీరి సంఖ్య ఎంత ఉంటుందో సమయానుకూలంగా వారే చెప్పాలి. ఏది ఎద్మైనా విద్యార్దుల హెచ్చరికలు రాష్ట్రాన్ని మరింత ప్రమాదకర పరిస్తితిలోకి తీసుకెళ్ళడం ఖాయం.

ఇక ఐదవ తారీకు వస్తోంది. ఇటు తెలంగాణా అటు సీమాంధ్రా నాయకులు తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలు ఉద్యమంలో తలమునకలైఉన్నారు. ఇక కాంగ్రెస్ ఏమి చేస్తుందో వేచి చూడాలి. అందరినీ కూర్చోబెట్టి బుజ్జగింపు కార్యక్రమం చేపట్టవచ్చు. తెలంగాణాకు అనుకూలంగా తమ ఎంఎల్ఏలపై కొంత వత్తిడి తేవచ్చు. అసెంబ్లీలో తీర్మానానికి వొప్పించవచ్చు. కానీ హైకమాండ్ మాటను ఎంఎల్ఏలు ఎంతవరకు వింటారు అనేది సందేహమే. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే తీర్మానం వీగిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి టీఅరెస్ కూడా దానికి సమ్మతించకపోవచ్చు. మధ్యస్తంగా హైదరబాదుకు కొంత వెసులుబాటు కల్పిస్తే తప్ప ఈ పీటముడి విడదు. నేరుగా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేటంత ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి ఐదవ తారీకు తరువాత ఎక్కడి సమస్య అక్కడే ఉండడానికే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల తెలంగాణాలో పరిస్తితుతులు మరింత విషమించి రాష్ట్రపతి పాలనకు దారితేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


10 comments:

సూర్యుడు said...

ప్రస్తుతం రాష్ట్రంలో వేరే పరిపాలన నడిస్తే కదా, రాష్ట్రపతి పాలన పెట్టడానికి ;)

ఎంత ముఖ్యంకాకపోతే సీమాంధ్ర రాజకీయనాయకులు హైదరాబదు కోసం ఇంత గొడవ చేస్తారు, ప్రజలకోసమంటే నమ్మేంత వెర్రిబాగులవాళ్లెవరైనా ఉన్నారా ;)

Anonymous said...

1. ఎన్నికలకు ముందు పోటిపడి తెలంగాన ఇచ్చేస్తాం అన్నారు .. మోసగాళ్ళు ఆ పాపం అనుభవించక తప్పదు ..
2. తెలంగాన రాకపొతే ప్రళయం, అణువిస్పోటనమే అని కె.సి.ఆర్ రెచ్చగొట్టాడు .. ఆ దిశలోనే విద్యార్దులు పయనించడంలో తప్పు ఎవరిది ? మౌనంగా వున్న మేధావులుదా ?
3. అధికారం కోసం కె.సి.ఆర్ ను పెంచి పోషించిన వై.యస్.ఆర్ మరియు చంద్రబాబులదా ?

Hima bindu said...

తప్పదు అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే

Anonymous said...

ఒక కొత్త నాయకత్వానికి అవకాశం ఇది. ఇలాంటి ఉద్యమాలనుంచే నాయకులు పుట్టేది.
ఇలాంటి అడ్డదిడ్డపు ప్రేలాపనలతో రాజకీయనాయకుల చదరంగంలో పావులై బలి పశువులు అవుతారు.
ముందు తెలంగాణా, ఆంధ్రా విద్యార్ది సంఘాలు ఒక నాయకుడిని ప్రజల ముందు ఉంచాలి .
రాజకీయాలను ప్రక్షాలన చేసే మహత్తర అవకాశాని దుడుకు రక్తంతో పాడూ చేయొద్దు.
చవకబారు బెదిరింపులు మాని, ఆచరణా పరంగా ఆలోచించండి

Unknown said...

తెలంగాణా ప్రజలకు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకునే హక్కు లేదా?

ఆనాడు మద్రాసు విషయం లో మడత పేచి పెట్టి తెగే దాకా లాగి పొట్టి శ్రీరాములి ప్రాణాలు బలి తీసుకున్నారు.
ఇవాళ ఇప్పటికే కొన్ని వందల తెలంగాణా ప్రజల ఉసురు పోసుకున్నారు.
ఇంకెంత మంది ప్రాణాలు కావాలో మీకు !

అసలు సమస్యను వదిలేసి అనవసరపు చర్చలెందుకు?

అన్న దమ్ముల్లా న్యాయంగా కలిసుండే సంస్కారం మీకు లేదు.
అన్న దమ్ముల్లా సామరస్యంగా విడిపోయే సహ్రుదయమూ మీకు లేదు. !
మా ఖర్మ.

karthik said...

"అన్న దమ్ముల్లా న్యాయంగా కలిసుండే సంస్కారం మీకు లేదు.
అన్న దమ్ముల్లా సామరస్యంగా విడిపోయే సహ్రుదయమూ మీకు లేదు."

ఇలాంటి విష ప్రచారం వల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది రాజన్నా.. తెలంగాణ ను ఉద్దరించే ఓపికా తీరికా మీ నాయకులకు లేవు.. వారిని నిలదీయకుండా వాళ్ళను వీళ్ళనూ ఆడిపోసుకోవడం బాగా అలవాటైపోయింది..

కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు రాజన్నా:
కేంద్ర మంత్రిగా ఉన్న కే.సి.ఆర్. తెలంగాణ కు ఏమి చేశాడు??
ఇప్పటి దాకా నల్గొండ ఎం.పీ. లుగా ఉన్న వారు ఫ్లోరైడ్ సమస్య గురించి ఎంత ఖర్చుపెట్టారు?? ఎం.పీ. ల్యాడ్స్ నిధులు పూర్తిగా ఆ ఎం.పీ. విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి.. అవి ఖర్చుపెట్టడానికి ఆంధ్రా వాళ్ళు ఎలా అడ్డు తగిలారు??
బీడీల పై పుర్రె గుర్తుకు కే.సీ.ఆర్. మంత్రిగా ఎందుకు అడ్డు చెప్పలేదు??

Krishna K said...

@రాజన్నా, పండగలు ఊళ్లకు వెళ్లినాళ్లను హైదరాబాద్ రానివ్వం అంటానికి వీళ్లకు హక్కు ఎక్కడిదే, వీళ్లదా హైద్రాబాద్? హైదరాబాద్, హైదరాబాద్ లో ఉండేటోళ్లది, ఈడ వోటు ఉన్నోళ్లది, ఈడ టాక్స్ కట్టేటోళ్లది అనే బుద్ది లేనోళ్ల గురించా నువ్వు వకాల్తా పుచ్చుకొంటున్నది.
ముందు మీ ఊళ్ళు మీరు బోయి, ఆడ కల్లు దుకాణం కాడ పెట్టుకొండి పంచాయతి, మా హైదరాబాద్లో ఎందుకే పంచాయితీ?
ముందు మామ్ములన్ వదిలి పోండి, ఆతర్వాత మీ ఖర్మకు మీరు బతకండి కాని, మా ఖర్మ కాల్చకండి. సంజ్ అయిందా?

విశ్వామిత్ర said...

@సూర్యుడు...... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండిఉంటే విద్యార్ధి గర్జనలు, వారి హెచ్చరికలు ఉండేవే కావు.

@a2zdream: ఎవరి మోసానికి ఎవరు శిక్ష అనుభవించాలి?

@ రాజన్నగారూ...>>>>>>>కలిసుండే సంస్కారం మీకు లేదు.
అన్న దమ్ముల్లా సామరస్యంగా విడిపోయే సహ్రుదయమూ మీకు లేదు.>>>>>

ఆంధ్రోళ్ళను కేసీఅర్ గారి దగ్గిరకు పంపమంటారా నేర్చుకోవడానికి? :)

Unknown said...

We don't want another Jharkhand.
if a student in karimnagar hasn't got enough opportunities in studies or in job, blame your leaders ,MLAs or MPs .don't cry on the people in hyderabad nor even the andhra people.

dear fellow citizens of united states of andhra pradesh (USA), wake up. stop bringing naxalism to the main streets.
Rosaiah brought miseries to the people of andhra pradesh. kick him out.
The present situation is root cause of puppet Manmohan (sorry Sonia) and highly educated moron Chidambaram.

Shashank said...

kosta vallu dochesaaru antunaaru kadha: one, YSR time lo major irrigation projects lo 5000 crores telangana ki, 2900 crores kosta ki, 2200 crores rayalaseema ki ketayinchaaru. Pranahita-chevella, etc. projects Nizamabad, Adilabad regions ki chaala upayogakaramyna projects. karimnagar prastutam vari pandinchadam lo godavari districts taruvaata sthanam lo vundhi (because of sriram sagar project). Jalayagnam lo major share Mahabubnagar (kalvakurthi,nettampadu, bhima, etc. projects)... intha importance Telangana region ki istunnaru.. Godavari waters dochesaamu antunnaru - assalu godavari water telangana vallu ela use chesukogalutaaranukuntunnadu aa Idiot KCR? Telangana godavari level kanna height lo vundhi. anduke intha kalam akkada ye vidamyna major projects lekunda poyayi.. Lift irrigation methods world ekkada antha success rate lekapoyinappatiki, YSR telangana ki edo cheddam ani cheppi avi start chesaadu. Godavari zillala lo 150Rs ki oka ekara bhoomi tadustunnte, telangana lo 1500Rs karchupettalsivastundhi... ayina sare, Telangana bhaagupadali ani ettipothala padakaalu start chesaaru.. inni chesina vallaku ekkadam ledu!

Hyderabad gurunchi vaste,, hyderabad mummatiki telangana loni dhe, kaani adhi mummatiki develop chesindhi kosta vallu. ippudu akkadi vellipomante, dochukune vallu telangana valla? kosta valla?

Janalu verri gorrellu! KCR eppudo BC naati kaburlu cheppi, andarini rechagodutunnadu.. Andhra state form ayyetapidiki Telangana Nizam valla paripalana lo bhayakaram ga tokkabadindi..oka vidam ga kosta koncham developed ga vundadaaniki kaaram British govt rule lo vundadame! 1950s ki Nalgonda lo okka school kooda vundedhi kaadu, ippudu 5000 high schools varaku akkada vunnayi.. AP state form ayina taruvaata ekkuva karchu Telangana prantam variki iccharandhi maatram vastavam..

Inka samaykandhra gurunchi vaste, pedda comedy chesaaru, aa lagadapati gaadu vallantha! Samaykam ga vundali ani ippudu gurtukochindi andariki? very funny! aa maata few years back aa KCR gadu extras chestunnappude analsindhi... votes kosam evari svardam vallu choosukunnaru.. ippudu AP ila tayaruchesaaru..