January 15, 2010

యార్లగడ్డ "ద్రౌపది" నవలపై బ్లాగుల్లో రాతలు....కామెంట్లు ....


హిందూ సంస్కృతి పరిరక్షణకు నేనేమి నడుము కట్టుకోలేదు. కానీ కొందరు హిందూ సాంప్రదాయాలపై దాడి అంటే మాత్రం ముందు వరుసలో నిలుస్తారు. అలాటివారిలో మన బ్లాగరు కత్తి మహేష్ కుమార్ గారు ఒకరు . యార్లగడ్డ రాసిన పుస్తకాన్ని వీరు చదువలేదు. అయినా ఆపుస్తకంపై ఒక టపా రాస్తూ ఆపుస్తకాన్ని విమర్శించిన వ్యక్తులపై వీరు విమర్శల వర్షం కురిపించారు. ఎందుకంటే ఆ పుస్తకంలో విమర్శకుల విమర్శలప్రకారం హిందూ సాంప్రదాయలపై దాడి జరిగిందికాబట్టి అది ఎలాటిదాడో తెలియకపోయినా అది వీరికి ఇష్టంకాబట్టి ఆ దాడిని వీరు సమర్ధిస్తారు. మహాభారతం యదార్ధమో కాదోనన్న విషయం పక్కనబెడితే ఆ కధలో ద్రౌపదికి ఐదుగు భర్తలున్న స్త్రీ అయినా ఒక ఉత్తమ స్త్రీగా చిత్రికరిస్తూ స్త్రీయెడల ఉన్నత భావాలు కలిగించారు. అయిదుగు భర్తలు గలిగిన స్త్రీ అంటే మిగిలిన విషయాలు విడమరచి చెప్పవలసిన అగత్యం లేదు. కానీ సోమవారం ఒకరితో సుఖించినది, మంగళవారం ఒకరితో సుఖించినది బుధవారమం మరొకరితో సుఖించినది అని చెప్పడంలోనే రచయిత ఉద్దేశ్యం బయట పడుతుంది. కొంతమందికి కొన్ని సమయాలలో కీర్తికోసం వెంపర్లాట మొదలౌతుంది. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పండితులు వారికి అన్ని గ్రంధాలు కరతలామలకం. కానీ ఎంతటివారైనా కొన్ని క్షణాలలో కీర్తి ప్రతిష్టలు కోరుకొవడం మానవ లక్షణం. కానీ ఆ పుస్తకం చదవకపోయినా మహేష్ గారి అత్యుత్సాహం కూడా ఇలాటిదే. ఆ పుస్తకాన్ని నేను చదవలేదు. తెలుగు సాహిత్యానికి గుర్తింపు రాలేదేనని మహేష్ బాధ పడుతున్నారుట. పురాణా ఇతిహాసాలని అపహాస్యం చేస్తూ కీర్తిని గడించాలని కోరుకోవడం సరియైనదేనా? ఆ బ్లాగులో వచ్చిన కామెంట్లు కూడా ఆశ్చర్యం కలిగించాయి. ద్రౌపదికి అయిదుగురు భర్తలను ఎలా కట్టబెట్టారు అని రచయిత అడిగిఉంటే బాగుండేదిగానీ అయిదుగురితో ఎలా సుఖించినదో తెలియచేయడంలోని ఔచిత్యం ఏమిటో మహేష్ రచయిత తరపున తెలియచేస్తారా?


14 comments:

అశోక్ చౌదరి said...

ha ha ha.. కత్తి బ్లాగ్ ఇంకా చదువుతున్నారా మీరు?
నేను ఆ టాపిక్ మీద వేరే పోస్ట్ చూసినప్పుడే అనుకున్న కత్తి దగ్గర నుంచి ఒక supporting పోస్ట్ రావలె ఇంకా రాలేదేంటి అని.. ?

అశోక్ చౌదరి said...
This comment has been removed by a blog administrator.
తెలుగు వెబ్ మీడియా said...
This comment has been removed by a blog administrator.
రవి said...

విశ్వామిత్ర గారు,

ఏది కరెక్టు అన్నమాట అటుంచితే, ఇలా ఒకరి మీదొకరిని ఉసిగొలిపి, మధ్యలో పబ్బం గడుపుకోవడం ఈ మధ్య అన్ని రంగాల్లోనూ వచ్చిన వినూత్న సంవిధానం.

చెత్త రాయడానికి సృజనాత్మకత అనవసరం. ఓ కొత్త తరహా కథో, మెలోడ్రామాయో, విషయపరిజ్ఞానమో, పదుగురు బాగుపడ్డానికి దోహదపడే ఆలోచనో, ఊహూ..ఇవేవీ వద్దు. ఓ పురాణమో మరొకటో తీసుకొని, దానికి సొంత interpretations రాస్తే చాలు. ఆ తర్వాత, కాగల కార్యం ఒరిజినల్ థింకర్సే చూసుకుంటారు. (ఒరిజినల్ థింకింగు అంటే, కల్లెక్టివ్ థింకింగుకు ఆపోసిట్ అన్నమాట. చూశారా, ఎంత ఒరిజినల్ గా ఉందో!)

అన్నట్టు, నిన్న విశాలాంధ్రకెళితే ఈ పుస్తకం గురించే మాట్లాడుకుంటున్నారక్కడ. స్టాకులో లేదంట. రచయిత ఉద్దేశ్యం నెరవేరింది. "రచన" అంటే ఏవిటో తెలుస్తూంది!

విశ్వామిత్ర said...

@ అశోక్ గారూ..
మీరు రాసిన ఒక కామెంట్ తీసివేశాను. ఏమి అనుకోవద్దు

@ప్రవీణ్..
ఒక విషయంగురించి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలే ప్రస్తావించాలి. ఎవరెవరి పేర్లనో ప్రస్తావించడం అసంబద్ధం. మీ కామెంటును తీసివేశాను.

@రవి...
మీతో నేను ఏకీభవిస్తున్నాను :)

అశోక్ చౌదరి said...

హ హ హ.. విశ్వామిత్ర గారు బయపడ్డాను అని ఒప్పేసుకోండి... just kidding.. :-)

విశ్వామిత్ర said...

@ అశోక్ గారూ...
భయం అని కాదు. వ్యక్తిగతంగా ఒకరి మనసుని బాధపెట్టడం మన వల్ల కాదు. :) కొందరు మనస్సులు నొచ్చుకుంటాయి అని తెలిసీ వ్రాయడం కొందరివల్లే అవుతుంది.

Sravya V said...

ఆ బ్లాగులో వచ్చిన కామెంట్లు కూడా ఆశ్చర్యం కలిగించాయి. >> ఆశ్చర్యం ? ఐతే మీరు బ్లాగులు సరిగా ఫాలో కావటం లేదన్న మాట :)
రవి గారు చెప్పిన దానితో నేను 100 % ఏకీభవిస్తున్నాను !

విశ్వామిత్ర said...

శ్రావ్య గారూ..
నిజమేనేమో...!! :(

చదువరి said...

ఆ రచనలో ఏం రాసారనేది నాకు తెలవదు. కానీ శ్రీకారంలో రాసిన విషయాన్ని మాత్రం పక్కదోవ పట్టించి, వక్రీకరించి రాసారు. అక్కడ ఆయన రాసిన కొన్ని వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి. ఆ తరవాత తన బ్లాగులో!

ఒక మనిషి తనలోని వల్లమాలిన అసహనాన్ని, అసహిష్ణుతనూ, అహంభావాన్నీ, హిందూ పురాణాలు, పౌరాణిక పాత్రల పట్ల తనకున్న నిర్హేతుకమైన అసహ్యాన్నీ అనుచితరీతిలో, వెగటుకలిగించే విధంగా వెళ్ళగక్కడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆ రాతలను చదవాలి.

మంచు said...

'రవి ' చెప్పింది వందశాతం నిజం..
ఆశొక్.. :-)) రెండొ కామెంట్ ఎమిటొ..

విశ్వామిత్ర said...

@ చదువరి గారూ...
ద్రౌపది నవలను చదివిన కస్తూరు మురలికృష్ణ గారు వారి బ్లాగులో తమ అభిప్రాయాన్ని ఉంచారు. చదవండి.

http://kasturimuralikrishna.com/?p=1138

@ మంచుపల్లకి...
ఆ కామెంటు ఏమై ఉంటుందంటారు? :)

Unknown said...

మిగతా విషయాలన్నీ పక్కన పెట్టినా నాకు వింతగా అనిపించినది పుస్తకం చదవకుండానే ఇష్టమొచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తపరచడం.

శోధించి, సాధించి గానీ జ్ఞానం సంపాదించని ఆయన మరి ఇలా ఊహించిన, విన్న విషయాలను గురించి ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు.

రవి గారు వ్యక్తపరచిన అభిప్రాయమే నాదీ!

తెలుగు వెబ్ మీడియా said...

కథని మార్చి వ్రాయడం తప్పు కాదని కత్తి అన్నాడు. నేను కూడా మార్చి వ్రాసిన కథలు చదివాను. చలం గారు సీత, చిత్రాంగి కథలని మార్చి వ్రాసారు. కథలని కాలానుగుణంగా మార్చడం తప్పు కాదు. Don't think that I am supporting Kathi. కథలని మార్చి వ్రాయడం నాకు తప్పనిపించడం లేదు.