January 13, 2010

కేసీఅర్ మౌనానికి కారణం?


కేసీఅర్ పేపర్‌లోగానీ చానల్స్‌లో గానీ మాట్లాడి పదిరోజులు కావస్తోంది. ఆయన మాండలికాలు, హెచ్చరికలు లేక పత్రికలు బోసిపోతున్నాయి. విలేకరులు నీరసపడిపోతున్నారు. ఆయన కనీసం కేమేరాలవంకైనా చూడటంలేదు. విలేకరులతో పెదవి విప్పి మాటైనా మాట్లాడటం లేదు. ఈ మౌనానికి కారణం ఏమిటో మరి? ఢిల్లీలో పార్టీల మీటింగు అయినతరువాత వ్యూహాత్మక మౌనం అని పేపర్లు అన్నాయి. కేంద్రం తన నిర్నయాన్ని ప్రకటించిన తరువాత ప్రతిస్పందిస్తామని టీఅరెస్ ప్రకటించింది. కేంద్రం కేవలం శాంతి మంత్రం తప్ప మరో మాట లేదు. తెలంగాణా జేఏసీ మీటింగు కూడా పెట్టుకుంది. అది అయినతరువాత కూడా కేసీఅర్ మాట లేదు. మరోపక్క తెలంగాణా జేఏసీ మరోమారు ఉద్యమానికి సంసిద్ధమౌతోంది. ఇన్ని జరుగుతున్నా కేసీఅర్ ప్రేక్షకుడిగానే ఉన్నారుగానీ పెదవి విప్పలేదు.

ఇది ఇలా ఉండగా మీడియాలో అనధికార వార్తల ప్రకారం గృహమంత్రి చిదంబరంగారు రాష్ట్రంలోని కొంతమంది నాయకుల సంపాదనలపైనా వారి బినామీ లావదేవీలపైనా ఒక నివేదికని సిద్ధం చేయించారని వినికిడి. దానిపై జాతీయ రక్షణ చట్టంకింద కేంద్రం తగు చర్యలు తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని ఈ సందర్భంలో చెప్పారట. మరి ఢిల్లీలో పార్టీల సమావేశం అయినతరువాత అందరూ శాంతి మంత్రం జపించిడంవెనుక మర్మం ఇదేనా? మరి ఇది కాకపొతే ఆ చిదంబర రహస్యమేమిటో?

గమనిక: ఈ వార్తని పట్టుకొని ఏదైనా చానల్ మరో చర్చా కార్యక్రమం చేపడితే జరిగే పరిణామాలకు ఈ బ్లాగు బాధ్యత వహించదని చానల్స్‌కు తెలియచేస్తున్నాము. :)

7 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

అయ్యా! రాష్ట్రం, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కదా! అలా ఉండనిద్దాం. మనం ఆజ్యం పొయ్యొద్దు.

విశ్వామిత్ర said...

అయ్యా రామకృష్ణారావు గారూ..
రెచ్చగొట్టడానికి మనమెంతవాళ్ళం చెపండి. మనం నాయకులం కాదు, విలేకరులం కాదు, చానల్స్‌లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళం కాదు. ఓచిన్ని బ్లాగులో నాలుగు రాతలు రాసుకొని తుత్తిపడేవాళ్ళం మాత్రమే :) కాబట్టి మీరు గాబరా పడనవసరం లేదు.

తమిళన్ said...

:)

Apparao said...

నేను కూడా ఊహాత్మక మౌనం పాటిస్తున్న
హహహ

Sravya V said...

:)

కత పవన్ said...

కే.సి.అర్ తేలంగాణా కి పేక ముక్క లో జోకర్ లా మీగిలాడు..
మౌనం గా ఉండడాం తప్పించి ఏమి చేయగలడు ప్రస్తుతానికి

kvsv said...

పవన్ గారూ వాళ్ళ మౌనాన్ని తక్కువగా అంచనా వెయ్యవద్దు ఒక నెంబర్1 రాస్త్రాన్ని అతలాకుతలం చేసి తెలుగువాళ్లని ఈరోజు దేశంలో జోకెర్ల గా నిలబెట్టిన కే.సి.ఆర్. మౌనాన్ని తక్కువగా అంచనా వెయ్యకండి