January 18, 2010

రంపపు కోతలాంటి రాతలెందుకో?




బ్లాగుల్లో కొన్ని టపాలు చదువుతూ ఉంటే చిన్న చిరునవ్వు అలా మెరిసి చటుక్కున మాయమౌతుంది. అలా అనిపిస్తే ఆ టపాకు ఒక సార్ధకత చేకూరినట్టే. టపా బాగున్నప్పుడు కామెంటడానికి బాగుంది అని చెప్పడం రోటీన్ అనిపించినప్పుడు నేనైతే చిన్న చిరునవ్వు :) వదిలిపెడతాను. నేను చదివాను మీ టపా నాకు నచ్చింది అని చెప్పడానికి. కానీ కొన్ని బ్లాగరుల రూటే వేరు. వారు ఏది చేసినా ఒక సంచలనం కోరుకుంటారు. అది వ్యతిరేకతతో కూడినదైనా సరే. వారి రాతలలో ఎన్నో నికృష్ట భావాలు కనబడుతూ ఉంటాయి. మనుషులలో నిబద్దత వీరికి నచ్చదు, సమాజమంటే ఏవగింపు, మనుషులపై అకారణ ద్వేషం వీరి రాతల్లో కనబడతాయి. సమాజంలో ఒక్క మంచి సంఘటన కూడా వీరి కంటికి కనబడదు. పదిమంది మెచ్చినది వీరు మెచ్చరు. పదిమంది చీ అంటే వీరు అద్భుతం అంటారు. అదేమి మిత్రమా అని అడిగితే కొన్ని పడికట్టుపదాలతో వీరు అర్ధం కాని భావాలెన్నొ చెప్పగలరు. పైగా ఇది నా బ్లాగు, నా ఇష్టం అంటారు. మరింత ముదిరితే మిమ్మలని నా భావాలతో ఏకీభవించమని నేను అడగలేదు, అసలు నా బ్లాగు చూడమని కూడా చెప్పలేదు అంటారు. కొన్ని టపాలు చదివినప్పుడు కొందరికి కలిగే భావాలు ఎలా ఉంటాయొ చిన్న ఉదాహరణ ఇస్తున్నాను.

"అయితే మీ శ్రేయోభిలాషిగా మీకోమాట చెబుదామనుకుంటున్నాను. లౌకికవాది అనే ముసుగు వేసుకున్నాను గదా నేనేంటో అసలెవరికీ తెలియదులే అని మీరు ఇంకా అనుకుంటూనే ఉన్నారు గదా! కాని అది తప్పు సార్.. ఆ ముసుగు చాలా పల్చగా ఉంది. ముసుగులోంచి మీ వంటిమీది చారలు స్పష్టంగా కనబడిపోతున్నాయి. క్రూరమైన కోరలు (కరాళ దంష్ట్రలవి :) ) నోట్లోంచి కారుతున్న చొంగా కనిపిస్తూనే ఉన్నాయి. అసహనం కారణంగా మీ గొంతులోంచి వచ్చే గురక వినిపిస్తూనే ఉంది. ఇక దాచలేరు సార్, ఆ ముసుగు తీసెయ్యండి. అసలు రూపును బయటపెట్టండి"

మనం రాసిన రాతలకు అవతలివారికి ఎంత ఒళ్ళు మండితే ఇలాటి కామెంట్లు వస్తాయి చెప్పండి. మన టపా చదివిన అందరికీ నచ్చాలని లేదు కానీ, చాలా మంది అసహనాన్ని వెళ్ళగక్కితే దానిలో కొంత లోపమున్నట్టే. మీరేమంటారో?

5 comments:

అశోక్ చౌదరి said...

మీరు ఎవరి గురించి అంటున్నారో అర్ధం అయింది.. ఒక వర్గం వారి మనో భావాలు పట్టించుకోకుండా తను ఒక మేధావి అనుకుని నోటికి వచ్చింది మొత్తం వాగటం అయన నైజం.. హు అలంటి వాళ్ళని మేధావులు అని కీర్తించే నిక్రుస్టులు వున్నారు... అది మన దురదృష్టం..

he is mentally sick man..

అశోక్ చౌదరి said...

You can edit or delete this comment if you want to..

Ajit Kumar said...

రవిగాంచనిచోటును కవిగాంచున్ అంటారుగదా. సాహితీ విమర్శకుని దృష్టికూడా అలాగే ఉంటుంది. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి చిత్రతో వోమాటంటాడు." నా మొహం నీకు కర్రి మొహంలా కన్పిస్తుందిగదూ... నీ మొహం నాకు బర్రె మొహంలా కనిపిస్తుంది. అది చూపులో తేడా " అంటూ చిత్రను భయపెడతాడు. ప్రతి బ్లాగరూ ఓకవే కనుక అన్ని రకాల అభిప్రాయాలనూ గౌరవించాలి.

Anonymous said...

SAY DIRECTLY MAN

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Absolutely right.